గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం ఆరోపణలు

March 11, 2026 1:00 PM

Gudivada ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణలు వెలువడ్డాయి. కడుపులో ఉన్న గడ్డను బిడ్డగా భావించి సుమారు 9 నెలల పాటు గర్భిణిగా చికిత్స చేసినట్లు బాధిత మహిళ ఆరోపించింది.

నెలలు గడుస్తున్నా బిడ్డ కదలికలు లేవని వైద్యులకు చెప్పినా పట్టించుకోలేదని మహిళ తెలిపింది. అంగన్వాడీ కేంద్రంలో టీకాలు కూడా వేయించుకున్నట్లు సమాచారం.అనుమానం రావడంతో మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించగా బిడ్డ కాకుండా కడుపులో గడ్డ పెరిగిందని వైద్యులు వెల్లడించారు. స్కానింగ్ రిపోర్టుతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేదలకు అందిస్తున్న వైద్య సేవలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media