LPG గ్యాస్ ధరల పెంపుపై AUTO యూనియన్ ఆగ్రహం

March 12, 2026 10:01 AM

Hyderabadలోని Nacharamలో బీఆర్‌టీయూ ఆటో యూనియన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా బీఆర్‌టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు Vemula Marayya మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా ఎల్పీజీ గ్యాస్ ధరలు పెంచి ఆటో డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

కొన్ని పెట్రోల్ బంకులు ఆయిల్ కంపెనీల అనుమతి లేకుండా ఎల్పీజీ గ్యాస్‌ను మీటర్‌కు రూ.30–40 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమంగా ధరలు పెంచిన గ్యాస్ బంకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదే సమయంలో ఆటో డ్రైవర్లు భయపడకుండా పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని ప్రభుత్వ రేట్ల పెంపుకు సంబంధించిన జీవో కాపీ చూపించాలని అడగాలని సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media