Nellore districtలో భూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ Himanshu Shukla ‘వన్ మంత్ వన్ విలేజ్’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు విడతలుగా అధికారులు గ్రామానికి వెళ్లి భూ వివాదాలను పరిశీలించి పరిష్కరిస్తున్నారు. భూ రికార్డులు, మ్యూటేషన్లు, సాదాబైనామా, డీకేటీ పట్టాలు, హౌస్ సైట్స్ వంటి సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటివరకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిల్లాలో 110 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించగా, 26 గ్రామాల్లో భూ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. మిగిలిన గ్రామాల్లో కూడా సమస్యల పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయి.
