Nizamabad districtలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు Immadi Gopi హత్యకు గురయ్యారు.

ఇమ్మడి గోపి రాత్రి తన కారులో స్వగ్రామానికి వెళ్తుండగా Indalvai శివారులో మరో కారుతో ఢీకొట్టిన వ్యక్తి అనంతరం ఆయనపై దాడి చేసి హతమార్చాడు. ఘటన అనంతరం నిందితుడు ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హత్యకు పాల్పడిన వ్యక్తి ఇమ్మడి గోపికి సమీప బంధువు, మేనల్లుడు అని పోలీసులు గుర్తించారు.
ఇమ్మడి గోపి గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో పనిచేసి, ఇందల్వాయి మండలంలో ఎంపీపీగా సేవలందించారు. ఆయన భార్య హేమలత ఇటీవల Gouraram గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ హత్య స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
