Buttayagudem మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన విభేదాలు అభం శుభం తెలియని ఐదేళ్ల బాలిక ప్రాణాలు తీసాయి.

Marrigudem గ్రామానికి చెందిన నాగేంద్రబాబు, Antharvedigudemకు చెందిన కుమారిలకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను భయపెట్టేందుకు భార్య కూల్‌డ్రింక్ సీసాలో పురుగుల మందు తీసుకొచ్చి ఇంటి వద్ద కంచెకు పెట్టింది.దానిని కూల్‌డ్రింక్ అనుకుని ఐదేళ్ల రితిక తాగడంతో అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
