N. Chandrababu Naidu అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల 6వ సమావేశం రెండో రోజు Andhra Pradesh Secretariatలో జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనా వ్యవస్థ పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు.అలాగే పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
