L. V. Subrahmanyam అనకాపల్లి జిల్లాలోని Sri Prakash Educational Institutionsను సందర్శించారు. ఆయనతో పాటు Bhagavatula Charitable Trust కార్యదర్శి భాగవతుల శ్రీరామమూర్తి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యా సంస్థలోని ఆయుర్వేద చికిత్సాలయం, డైరీ ఫార్మ్, బయోగ్యాస్ యూనిట్, సేంద్రీయ వ్యవసాయం, పుట్టగొడుగుల పెంపకం, హైడ్రోపోనిక్స్, బేకరీ వంటి విభాగాలను పరిశీలించారు. విద్యార్థులు ప్రాయోగికంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు.చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో వివిధ రంగాల్లో రాణించేందుకు విద్యార్థులకు సూచనలు చేశారు.
