Nirmal జిల్లాలోని Kondapur గ్రామ శివారులో National Highway 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఐచర్ వ్యాను టైరు పేలి అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
Sonapalli గ్రామం నుంచి Armurకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో Rajiv Gandhi Institute of Medical Sciences Adilabadకు తరలించారు.మరో 17 మంది గాయపడిన వారిని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ Janaki Sharmila గాయపడిన వారిని పరామర్శించారు.
