WAR ప్రభావం.. నిజామాబాద్‌లో గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీ క్యూలు

March 12, 2026 3:45 PM

Nizamabad జిల్లాలో గ్యాస్ కొరత భయంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీగా బారులు తీరుతున్నారు. పశ్చిమాస్య దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా తగ్గుతుందన్న ఆందోళనతో ఉదయం నుంచే ప్రజలు ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు.

Iran – Israel మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో గ్యాస్ సరఫరాపై ప్రభావం పడుతుందనే భయంతో ప్రజలు ముందస్తుగా సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే డొమెస్టిక్ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్యాస్ బుకింగ్ చేసిన వారికి ఆన్‌లైన్ బిల్లులు ఆలస్యంగా రావడంతో చాలా మంది నేరుగా ఏజెన్సీలకు వెళ్లి బిల్లులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే కమర్షియల్ గ్యాస్ కొరత మరింత పెరిగి హోటళ్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media