తిరుపతి చేరుకున్న మంత్రి నారా లోకేష్.. నెల్లూరు పర్యటనకు సిద్ధం

March 12, 2026 3:48 PM

Nara Lokesh Tirupati Airportకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడే కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలను మంత్రి స్వీకరించారు.

తరువాత ఆయన Nellore districtలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా Sagar Defence Engineering సంస్థ ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు.అలాగే Juvvaladinne Fishing Harbour వద్ద అటానమస్ మారిటైమ్ షిప్ బిల్డింగ్ మరియు సిస్టమ్స్ సెంటర్‌కు కూడా మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్‌ను అభివృద్ధి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.మొదటి దశలో రూ.45 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుండగా, సుమారు 750 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media