Neredmetలో విషాద ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీనగర్‌కు చెందిన నగెల్లి శ్రీనివాస్ (41) అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, శ్రీనివాస్ స్వగ్రామం Mandamarri మండలం రామకృష్ణాపూర్. 2012లో సట్లపల్లి జ్యోతిని వివాహం చేసుకున్నాడు. భార్య ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు శ్రీనివాస్ ప్రోత్సహించగా, ఆమె తర్వాత ఎక్సైజ్ సీఐగా పదోన్నతి పొందింది.అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య భర్తను దూరం పెట్టడంతో పాటు వరకట్న వేధింపులు, విడాకుల కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలలుగా శ్రీనివాస్ ఒంటరిగా జీవిస్తున్నాడు.భార్య వేధింపులు, కోర్టు కేసుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ సూసైడ్ నోట్ రాసి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాస్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్య జ్యోతి సహా మరో 10 మందిపై కేసు నమోదు చేశారు.
