AP:సకాలంలో చికిత్స.. లారీ డ్రైవర్ ప్రాణాలు కాపాడిన వైద్యులు

March 12, 2026 4:18 PM

Kothapeta ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సకాలంలో స్పందించి తీవ్ర గుండెపోటుకు గురైన లారీ డ్రైవర్ ప్రాణాలను కాపాడారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అశోక్ జైస్వాల్ అనే లారీ డ్రైవర్ Ravulapalemకు లోడు కోసం వచ్చిన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు.

స్థానికులు వెంటనే అతన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, విధుల్లో ఉన్న డాక్టర్ నాగరాజు, డాక్టర్ పూజిత వెంటనే ఈసీజీ పరీక్షలు చేసి అత్యవసర చికిత్స ప్రారంభించారు. గుండె రక్తనాళాల్లో ఏర్పడిన రక్తగడ్డలను కరిగించేందుకు ఉపయోగించే Tenecteplase (TNK-tPA) ఇంజెక్షన్‌ను ఇచ్చారు.సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు రూ.50 వేల వరకు ఖరీదు చేసే ఈ ఇంజెక్షన్‌ను ప్రభుత్వ సదుపాయం ద్వారా ఉచితంగా అందించి డ్రైవర్ ప్రాణాలను రక్షించారు. ప్రస్తుతం బాధితుడు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. సకాలంలో స్పందించిన వైద్యులు, సిబ్బందిని స్థానికులు అభినందిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media