Jammalamaduguలో మైనర్ బాలికను మాయమాటలతో మోసగించి బలవంతంగా పెళ్లి చేసుకున్న కేసులో Kadapa పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు మహమ్మద్ భాషకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది.

పోలీసుల వివరాల ప్రకారం, జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లె గ్రామానికి చెందిన మహమ్మద్ భాష అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని పలుమార్లు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలింది.బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.అలాగే బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు కోర్టు ఆదేశించినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.
