Sports Authority of Andhra Pradesh ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ట్రైబల్ స్పోర్ట్స్ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ Kovvasu Jagadeeswari తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా Polavaram మరియు Nandyal జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ముఖ్యంగా Rampachodavaram మరియు సున్నిపేట గిరిజన పాఠశాలల్లో ఈ టాలెంట్ హంట్ కార్యక్రమం జరుగుతుంది.ఇక రాష్ట్రంలోని మిగతా 26 జిల్లాల్లో ఇప్పటికే జరుగుతున్న SAAP లీగ్స్ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ అందించేందుకు స్పోర్ట్స్ అకాడమీలు మరియు స్పోర్ట్స్ స్కూల్స్లో చేర్పించనున్నారు.

అర్హతలు:
ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే అభ్యర్థులు 8 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి (01-04-2012 నుంచి 31-03-2018 మధ్య జననం). అలాగే ప్రభుత్వ లేదా ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలో చదువుతూ ఉండాలి. జనన సర్టిఫికేట్ మరియు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి.ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ మరియు అవకాశాలు కల్పించడమే లక్ష్యమని డైరెక్టర్ తెలిపారు.
