వెంకటగిరిలో ఘనంగా YSRCP ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

March 13, 2026 11:33 AM

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో YSR Congress Party ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి సూచనల మేరకు ఎన్‌జేఆర్ భవన్ ప్రాంగణంలో పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముందుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు.ఈ సందర్భంగా కోడూరు కల్పలత మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో Y. S. Jagan Mohan Reddy ను మళ్లీ ముఖ్యమంత్రిగా, నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి, చిట్టెటి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media