మహబూబ్‌నగర్‌ ముగ్గురు పిల్లలను బావిలో తోసి తల్లి ఆత్మహత్య

March 13, 2026 12:43 PM

భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో తల్లి తన ముగ్గురు పిల్లలను బావిలో తోసి, అనంతరం తాను కూడా దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఈ ఘటనలో తల్లి జంగమ్మ (40)తో పాటు కుమార్తెలు జ్యోతి (14), శైలజ (12) మృతి చెందారు. అయితే కుమారుడు జస్వంత్ బావిలో ఉన్న చెట్టు వేర్లను పట్టుకుని ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.వ్యవసాయ పొలంలో రెండో బోరు వేయాలన్న విషయంలో భర్త బీరయ్యతో జరిగిన వాగ్వాదం అనంతరం ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media