వేములవాడ ఆసుపత్రి డాక్టర్ లేరని గర్భిణీని తిరస్కరించిన సిబ్బంది

March 13, 2026 1:44 PM

డాక్టర్ అందుబాటులో లేరని కారణంతో గర్భిణీని ఆసుపత్రిలో చేర్చుకోకుండా పంపించిన ఘటన Vemulawada ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

Rudrangi గ్రామానికి చెందిన గౌతమి అనే మహిళకు గర్భధారణకు 9 నెలలు 4 రోజులు కావడంతో అస్వస్థతగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే గైనకాలజిస్ట్ డాక్టర్ అందుబాటులో లేరని చెబుతూ నర్సింగ్ సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోకుండా బయటకు పంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.అత్యవసర సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో 9 నెలల గర్భిణీని తిరస్కరించడంతో బంధువులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమెను మరో 108 అంబులెన్స్లో Sircilla జిల్లా ఆసుపత్రికి తరలించారు.ఇక వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెల రోజులుగా గైనకాలజిస్ట్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media