Machilipatnamలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. Perni Nani నివాసం సమీపంలోని రామానాడుయుపేట సెంటర్లో Jana Sena Party జెండా దిమ్మ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో YSR Congress Party మరియు జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
జనసేన నేత శాయన శివయ్యపై వైసీపీ నాయకులు బొర్రా విఠల్, మేకల సుబ్బన్న దాడికి యత్నించారని జనసేన కార్యకర్తలు ఆరోపించారు. దీనికి జనసేన కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.సమాచారం అందుకున్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్, డీసీఎంఎస్ ఛైర్మన్ Bandi Ramakrishna ఘటన స్థలానికి చేరుకుని వైసీపీ నేతల చర్యలను ఖండించారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.అన్ని అనుమతులతోనే జెండా దిమ్మ నిర్మాణం చేపట్టామని, వైసీపీ నేతల దాదాగిరికి భయపడబోమని బండి రామకృష్ణ తెలిపారు.
