జిల్లా ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి Kinjarapu Ram Mohan Naidu శుభవార్త అందించారు. ఆయన చొరవతో మూడు రైళ్లకు సంబంధించి మూడు కొత్త రైల్వే హాల్టులు మంజూరయ్యాయి.
రైల్వే శాఖ మంత్రి Ashwini Vaishnawతో జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్తగా Harischandrapuram Railway Station, Mandasa Road Railway Station, Pathapatnam Railway Station వద్ద రైళ్లు ఆగనున్నాయి.గుణుపూర్–విశాఖపట్నం ప్యాసెంజర్ (58505/06) ఇకపై హరిశ్చంద్రపురం వద్ద, బెర్హంపూర్–విశాఖపట్నం ప్యాసెంజర్ (18525/26) మందస రోడ్ వద్ద, అలాగే రూర్కెలా–గుణుపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ (18117/18) పాతపట్నం వద్ద హాల్ట్ కల్పించారు.ఈ కొత్త హాల్టులతో జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు అభివృద్ధికి దోహదం చేస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ సహకారం అందించినందుకు మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త హాల్టుల మంజూరుపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
