మహిళల భద్రత కోసం Cyberabad Police Commissionerate పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్చి 7 నుంచి 13 వరకు Anti Human Trafficking Unit (AHTU) మరియు SHE Teams నిర్వహించిన తనిఖీల్లో పలువురిపై కేసులు నమోదు చేశారు.

ఏహెచ్‌టీయూ నైట్ రైడ్స్‌లో ముగ్గురు సెక్స్ వర్కర్లు, ఇద్దరు ట్రాన్స్జెండర్లు సహా మొత్తం 9 మందిని పీటీఐటీ కేసుల్లో అదుపులోకి తీసుకున్నారు. బాధితులను రక్షించి వారికి సహాయం అందించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఒక స్పా సెంటర్‌పై కూడా కేసు నమోదు చేశారు.ఇక షీ టీమ్స్ నిర్వహించిన 124 డీకాయ్ ఆపరేషన్లలో ప్రజా ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించిన 43 మందిని పట్టుకున్నారు. వీరిలో 36 మందిపై కేసులు నమోదు చేయగా, మిగతావారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళల నుంచి వచ్చిన 146 ఫిర్యాదులను స్వీకరించి చర్యలు చేపట్టారు.కుటుంబ కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించి 46 కుటుంబాలను మళ్లీ కలిపారు. అలాగే నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో 4,532 మందికి మానవ అక్రమ రవాణా, ఈవ్‌టీజింగ్, సైబర్ మోసాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు.
