విజయవాడలో ప్రమాద ప్రాంతాల గుర్తింపు.. NDRF ప్రత్యేక సర్వే

March 14, 2026 3:26 PM

వరదలు, తుఫానుల సమయంలో ప్రమాదాలను ముందుగానే గుర్తించి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో National Disaster Response Force (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందం Vijayawada పశ్చిమ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు మరియు కొండచరియలు పడే ప్రమాద ప్రాంతాలను గుర్తించింది.

శనివారం పశ్చిమ తహసీల్దార్ రెబ్కా రాణి ఆధ్వర్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం, రెవెన్యూ అధికారులు కలిసి పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. గూగుల్ మ్యాపింగ్ సాయంతో ప్రమాద ప్రాంతాలను కోఆర్డినేట్స్‌తో గుర్తించి మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టారు.లోతట్టు ప్రాంతాలుగా భవాని ఘాట్, హెచ్‌బి కాలనీ, కుమ్మరి బజార్, ఓల్డ్ ఏరియాలు, లేబర్ కాలనీలను గుర్తించారు. అలాగే కొండచరియలు పడే ప్రమాద ప్రాంతాలుగా సొరంగం కొండ, రామరాజ్య నగర్, మర్రిచెట్టు సెంటర్, కుమ్మరపాలెం కొండ, కొత్తపేట హిల్, చిట్టీనగర్ కొండ, ప్రైజర్‌పేట, గొల్లపాలెం గట్టు ప్రాంతాలను గుర్తించారు.ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంపై స్థానిక ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media