శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతి సందర్భంగా Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో మెట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం Alipiri Mettu Pathway వద్ద భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్ మాట్లాడుతూ, జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం యొక్క అసలు భావమని తెలిపారు. పూర్వం నుంచి అనేక మంది మహనీయులు మెట్ల మార్గంలో నడిచి తిరుమలకు చేరుకుని స్వామివారి కృపను పొందారని చెప్పారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు వెయ్యికి పైగా భజన మండళ్ల సభ్యులు, సంగీత కళాకారులు భజనలు చేస్తూ సప్తగిరులను అధిరోహించారుఇక ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి సింగపూర్ నుంచి వచ్చిన “అష్టలక్ష్మి విద్యార్థుల బృందం” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డా. కె. భాగ్యమూర్తి ఆధ్వర్యంలో వచ్చిన 20 మంది కళాకారులు మెట్లోత్సవంలో పాల్గొని అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు.అలిపిరి పాదాల మండపంలో అన్నమాచార్య వంశీయులు మెట్లపూజ నిర్వహించగా, అనంతరం “బ్రహ్మ కడిగిన పాదము”, “భావములోన బాహ్యమునందును”, “ఎంతమాత్రమున ఎవ్వరు దలచిన” వంటి ప్రసిద్ధ సంకీర్తనలతో గోష్టిగానం నిర్వహించారు.
