సాగర తీరంలో నగరవాసులకు కొత్త అనుభూతిని అందించేందుకు Vizag Expo 2026లో 360 డిగ్రీల వర్చువల్ డూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఎగ్జిబిషన్ Visakhapatnam బీచ్ రోడ్డులోని Andhra University Groundsలో ఏర్పాటు చేశారు.

శుక్రవారం ప్రారంభమైన ఈ వర్చువల్ డూమ్‌లో 360 డిగ్రీల స్క్రీన్‌పై కదిలే చిత్రాలను వీక్షించే ప్రత్యేక అనుభూతి సందర్శకులను అబ్బురపరుస్తోంది. ఒకేసారి 40–50 మంది వరకు వీక్షించగల ఈ డూమ్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.ఎగ్జిబిషన్‌లో యమలోకం, డైనో పార్క్, ఎమ్యూజ్‌మెంట్ రైడ్స్, షాపింగ్, ఫుడ్ స్టాల్స్‌తో పాటు ఈ వర్చువల్ డూమ్ ప్రధాన ఆకర్షణగా మారింది. రాష్ట్రంలో తొలిసారిగా రూ.1.5 కోట్ల వ్యయంతో ఈ 360 డిగ్రీల డూమ్‌ను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

