TG:జోగిపేటలో డ్వాక్రా మహిళల మధ్య ఘర్షణ

March 14, 2026 5:42 PM

జిల్లా Jogipetలోని పంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో డ్వాక్రా మహిళల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. డ్వాక్రా గ్రూప్‌కు సంబంధించిన డబ్బుల వ్యవహారంపై నెలలుగా కొనసాగుతున్న వివాదం శనివారం ఉద్రిక్తతకు దారి తీసింది.

కొంతమంది సభ్యులు గ్రూప్‌కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదని ప్రశ్నించగా వాగ్వివాదం చెలరేగి, ఆగ్రహంతో మహిళలు కట్టెలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలకు తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి.స్థానికులు 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువైపుల మహిళలను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని Jogipet Government Hospitalకు తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media