ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి Kavuri Sambasiva Rao కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పరామర్శించారు.
హైదరాబాద్‌లోని కావూరు నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా, ప్రజాప్రతినిధిగా కావూరు సాంబశివరావు అందించిన సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
