మాజీ డీజీపీ H. J. Dora మృతిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar నివాళులు అర్పించారు.

హైదరాబాద్‌లోని దొర నివాసానికి వెళ్లిన బండి సంజయ్ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా దొర సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన నిజాయితీ, క్రమశిక్షణ, ధైర్యానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.1972 బ్యాచ్ IPS అధికారిగా ఎంపికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేసి డీజీపీగా సేవలందించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. నక్సలిజం నిర్మూలనలో ఆయన చూపిన ధైర్యం పోలీస్ వ్యవస్థకు గౌరవం తీసుకొచ్చిందని అన్నారు.
