Rapur మండలంలోని తెగచర్లలో గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 16 నుంచి ఏప్రిల్ 14 వరకు మొత్తం 30 రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా B. V. Suresh ఆధ్వర్యంలో తెగచర్ల మరియు కంభాలపల్లి గ్రామాల్లో పోస్టర్ ఆవిష్కరించి పశువులకు టీకాలు వేశారు.అధికారులు మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి సోకిన పశువుల నోరు మరియు గిట్లలో పుండ్లు ఏర్పడి తీవ్రమైన జ్వరం వస్తుందని తెలిపారు. పుండ్ల కారణంగా పశువులు ఆహారం తీసుకోకపోవడం వల్ల పాల ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి రైతులు ఈ టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
