రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు “దివ్యాంగశక్తి” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించనుంది.

సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. 21 కేటగిరీల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుంది.సహాయకులతో కలిపి సుమారు 12.76 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు రూ.207 కోట్లు వెచ్చించనుంది.
