మండపేటలోని ఆశ్రమ్ పాఠశాల విద్యార్థిని గౌరి జష్విక అంతర్జాతీయ వేదికపై అద్భుత విజయాలు సాధించి అందరి ప్రశంసలు పొందుతోంది. చిన్న వయసులోనే తన చిత్రకళా ప్రతిభతో 10 అంతర్జాతీయ రికార్డులు, 6 బంగారు పతకాలు సాధించి పాఠశాలకే కాక రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.

ఢిల్లీకి చెందిన పోటీల్లో కేవలం 45 నిమిషాల్లో ‘శివతాండవం’ చిత్రాన్ని గీసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ముంబైలో జరిగిన రంగోత్సవ్ ఆర్ట్ కాంపిటీషన్లో 4 బంగారు పతకాలు, 2025 అంతర్జాతీయ పోటీల్లో మరో 2 బంగారు పతకాలు సాధించింది.సైన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ‘జీవవైవిధ్యం’ అంశంపై ఆమె గీసిన చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రతిభకు గుర్తింపుగా జష్వికకు ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం లభించింది.చదువుతో పాటు కళల్లోనూ ప్రతిభ చూపుతున్న జష్విక భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.
