TG:హిందూ సమాజ ఐక్యతే లక్ష్యం RSS

March 18, 2026 3:48 PM

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) హిందూ సమాజంలో ఐక్యత, మార్పు కోసం “పంచ పరివర్తన్” కార్యక్రమంపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 73 వేలకుపైగా శాఖలు కొనసాగుతున్నాయని, సమాజంలోని అన్ని వర్గాలను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడం సంఘం లక్ష్యమని పేర్కొన్నారు.సామాజిక సమరసత, కుల వివక్ష నిర్మూలన, కుటుంబ వ్యవస్థ బలోపేతం, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ జీవన విధానం ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.యువతలో జాతీయవాద భావాలను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని, తెలంగాణలో సంఘ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని చెప్పారు.భారతదేశం తన సంస్కృతిని కాపాడుకుంటూ ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించాలన్నదే లక్ష్యమని, శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ వెల్లడించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media