సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ నటి రేణు దేశాయ్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో దూషణాత్మక వ్యాఖ్య చేసిన కేసును విచారించి నిందితుడిని గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం కోటిపల్లి వెంకన్న అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా వినియోగిస్తుండేవాడు. ఇటీవల ఒక రీల్‌పై అసభ్య వ్యాఖ్యలు పోస్టు చేయడంతో కేసు నమోదు చేశారు.దర్యాప్తులో భాగంగా మాధాపూర్‌లో నిందితుడిని మార్చి 17న అదుపులోకి తీసుకుని, గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా వ్యాఖ్య చేసినట్లు నిర్ధారించారు.సోషల్ మీడియా వినియోగంలో బాధ్యతగా వ్యవహరించాలని, అసభ్య వ్యాఖ్యలు చట్టపరమైన చర్యలకు దారి తీస్తాయని పోలీసులు హెచ్చరించారు. సైబర్ నేరాలపై 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

