దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’ పథక ప్రారంభం MLA బండారు

March 18, 2026 5:20 PM

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ‘దివ్యాంగ శక్తి’ పథకం కింద దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే, 40 శాతం పైగా వైకల్యం ఉన్న వారికి ఈ సదుపాయం వర్తిస్తుందని చెప్పారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ ప్రయాణం అందుబాటులో ఉంటుందని వివరించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీలలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది దివ్యాంగులకు ఇది లాభం చేకూరుస్తుందని చెప్పారు.దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు పెంచినట్లు పేర్కొంటూ, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media