భీమిలి MLA గంటా శ్రీనివాసరావు 40వ వివాహ వార్షికోత్సవం video

March 18, 2026 5:52 PM

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరియు శారద దంపతుల 40వ వివాహ వార్షికోత్సవం భోగాపురంలోని Sun Ray Resorts లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వేడుకలను కుమారుడు రవితేజ, కోడలు శరణి, కుమార్తె పూజిత, అల్లుడు ప్రశాంత్ ఘనంగా నిర్వహించారు. 40 ఏళ్ల క్రితం జరిగిన ప్రేమ వివాహాన్ని గుర్తు చేస్తూ సాంప్రదాయబద్ధంగా మళ్లీ వివాహ వేడుక నిర్వహించారు.ప్రఖ్యాత సినీ గాయకుడు ధనుంజయ్ నేతృత్వంలో సంగీత్, మెహందీ కార్యక్రమాలు నిర్వహించగా, ఉదయం 11:11 గంటలకు ముహూర్తానికి తాళి కట్టుకుని దంపతులు దండలు మార్చుకున్నారు.ఈ కార్యక్రమానికి మంత్రి పి నారాయణ, డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణం రాజు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పల్లా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు, అలాగే శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు.తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు, బంధువులు, స్నేహితులు పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media