రాజులు తాళ్ళవలస బంగారమ్మ అమ్మవారికి వెండి కిరీటం

March 18, 2026 5:55 PM

మండలం రాజులు తాళ్ళవలస గ్రామంలోని బంగారమ్మ ఆలయం లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆర్.ఆర్ బిల్డర్స్ డెవలపర్ మాకాల వెంకట అప్పారావు, సూర్యకళ దంపతులు అమ్మవారికి సుమారు లక్ష రూపాయల విలువైన వెండి కిరీటం, మంగళసూత్రాలు బహుకరించారు. మొక్కుబడిగా ఈ కానుకలు సమర్పించినట్లు వారు తెలిపారు.గ్రామంలో మేళతాళాలతో కిరీటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయానికి చేర్చి అమ్మవారికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో పి. శేషగిరిరావు, రమాదేవి దంపతులు తదితరులు పాల్గొన్నారు.భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media