రాపూరు మండలం నవాబుపేట గ్రామంలో ‘రైతన్న-మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం రైతుల సమస్యల పరిష్కారానికి చేపట్టబడింది.
వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రాపూరు మండలం టిడిపి అధ్యక్షుడు చెన్నూ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఇంటింటికీ వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుని, ‘అన్నదాత సుఖీభవ’ పథకం గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
