AP:తాడిపత్రిలో ఉడకని తలకూర తో పోలీస్ స్టేషన్‌కు…

March 23, 2026 9:41 AM

తాడిపత్రిలో ఉగాది సందర్భంగా ఓ వింత ఘటన చోటుచేసుకుని స్థానికంగా చర్చనీయాంశమైంది.పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మార్కెట్‌లో కొనుగోలు చేసిన మటన్ ఎంతసేపు ఉడికించినా మృదువుగా కాకపోవడంతో అనుమానం వ్యక్తం చేశాడు.

సుమారు 20 సార్లు వండినప్పటికీ మటన్ ఉడకకపోవడంతో విక్రేతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.దీంతో వండిన తలకూర పాత్రతో సహా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.సమస్యను విన్న పోలీసులు ముందుగా విక్రేతతో మాట్లాడాలని సూచించి, వివాదాన్ని సర్దిచేశారు.ఈ ఘటన స్థానికంగా హాస్యాస్పదంగా మారగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media