KKDలో G.O 17 రద్దు చేయాలి CPI డిమాండ ఆస్తుల కబ్జాపై ఆగ్రహం

March 23, 2026 9:55 AM

జీవో నెంబర్ 17 ద్వారా భూముల కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది.

CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ, ప్రజల ఆస్తులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ కు టూరిజం పేరుతో 3.4 ఎకరాల భూమిని 66 ఏళ్ల లీజుకు ఇవ్వడం అన్యాయమన్నారు.ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.అలాగే సర్పవరం ప్రాంతంలోని భవన్నారాయణ స్వామి దేవస్థానం భూములు కబ్జాలకు గురవుతున్నాయని, దీనిపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ అంశంపై సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media