గరికపాటి వ్యాఖ్యలపై Prof నాగేశ్వర్ ఆగ్రహం

March 23, 2026 11:53 AM

ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా స్పందించారు.

గరికపాటి వ్యాఖ్యలు అక్కసుతో చేసినవిగా కనిపిస్తున్నాయని, ఆయన స్థాయికి ఇవి తగవని నాగేశ్వర్ అన్నారు. పేద, అణగారిన వర్గాల పిల్లలను అవహేళన చేయడం బాధాకరమని పేర్కొన్నారు.ఇటీవల జరిగిన సభలో గరికపాటి “పిల్లలకు చదువు సరిపోతుంది, భోజనం అవసరం లేదు” అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో నాగేశ్వర్ మాట్లాడుతూ, ఆకలితో ఉన్న పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరని ప్రశ్నించారు.మధ్యాహ్న భోజన పథకం వల్ల విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయని గుర్తు చేశారు. గరికపాటి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు.పేద పిల్లలకు అన్నం పెట్టడాన్ని తప్పుబట్టడం సరికాదని, వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ విజ్ఞప్తి చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media