రాజంపేట దొంగతనం కేసు ఛేదనం: ఇద్దరు అరెస్ట్

March 23, 2026 12:04 PM

రాజంపేట మండలం ఎర్రబల్లి గ్రామంలో జరిగిన దొంగతనం కేసును మన్నూరు పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన మాబాషా (26), సాయికుమార్ (28)లను అరెస్ట్ చేశారు.

ఫిబ్రవరి 6న తాళం వేసిన ఇంటిలో జరిగిన ఈ దొంగతనంలో సుమారు రూ.9 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే మాట్లాడుతూ, అరెస్టైన నిందితులపై గతంలో కూడా పలు దొంగతన కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోందన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media