కడప జిల్లా ఒంటిమిట్టలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీ కోదండరాములవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశించారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆలయం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలు, కల్యాణ వేదిక పరిసరాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు.వీఐపీ, వీవీఐపీ రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

