నెల్లూరు జిల్లా రాపూరు మండలానికి చెందిన బీసీ సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మతకాల సాయి యాదవ్, యాదవ్ భవన్ చైర్మన్ బోమ్మి కిషోర్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సంఘ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఛాన్ భాషా, జేట్ వేణు, సాయికృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ పిట్టబోయిన వెంకటసుబ్బయ్య యాదవ్, హేమచంద్ర యాదవ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
