పెంచలకొన హుండీ లెక్కింపు… 45 రోజుల్లో రూ.52 లక్షలు

March 24, 2026 11:35 AM

నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకొన శ్రీపెనుశీల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 2026 ఫిబ్రవరి 4 నుంచి మార్చి 23 వరకు 45 రోజుల వ్యవధిలో హుండీల ద్వారా రూ.52,20,244 నగదు ఆదాయం లభించింది.అదనంగా బంగారు, వెండి ఆభరణాలు మరియు అమెరికా, కువైట్, కెనడా, మాల్దీవులు, భూటాన్ తదితర దేశాల కరెన్సీలు కూడా స్వామివారికి భక్తులు సమర్పించారు.ఈ హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఈఓ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షించగా, ఆలయ అర్చకులు, బ్యాంక్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media