బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా కోర్టు వ్యవహారాల్లో కచ్చితత్వం పాటించాలని జిల్లా ఎస్పీ Shelke Nachiket Vishwanath ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు.

కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని, పెండింగ్ ట్రయల్ కేసుల్లో వేగవంతమైన విచారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాక్షులను సమయానికి కోర్టులో హాజరు పరచడం, వారికి ధైర్యం చెప్పడం ద్వారా శిక్షల శాతం పెంచాలని తెలిపారు.

పిపిలతో, న్యాయ వ్యవస్థతో సమన్వయం పెంచుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని, పెండింగ్ సమన్లు, వారెంట్లు అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.కోర్టు విచారణల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించి, సరైన సాక్ష్యాధారాలతో కేసులను బలోపేతం చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు.
