నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలం గిరిజన ప్రాంతాలైన పొగిళ్ల, కంబాలపల్లి గ్రామాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలను సందర్శించిన కలెక్టర్, స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారు.

పొగిళ్ల గ్రామంలో ఇప్పటికే మోకా సర్వే నిర్వహించగా, ఏప్రిల్ 15 నుంచి ప్రత్యేక సర్వే బృందాలతో భూముల పూర్తి స్థాయి సర్వే చేపడతామని వెల్లడించారు.ప్రస్తుత పట్టాలు, రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహించి, అర్హులైన రైతులకు ‘భూ భారతి’ ద్వారా పట్టాలు అందజేస్తామని తెలిపారు. సర్వే ప్రక్రియకు రైతులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
