R.D.Tకి ఊరట అడ్డంకులు తొలగించిన మంత్రి నారా లోకేష్

March 25, 2026 11:51 AM

ఆంధ్రప్రదేశ్‌లో పేదల కోసం సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కు ఎదురైన అడ్డంకులు తొలగినట్లు సమాచారం. విదేశీ నిధులపై ఉన్న పరిమితులను సడలించడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది.

ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) కింద ఆర్డీటీకి నిధుల రాక ఆగిపోవడంతో సంస్థ కార్యకలాపాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ అంశాన్ని ఆర్డీటీ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, కేంద్రంతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపించారు.ఈ నేపథ్యంలో మాంచో ఫెర్రర్ మంత్రి లోకేష్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ఆర్డీటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని లోకేష్ పేర్కొన్నారు.ఆర్డీటీ సేవలు నిరంతరం కొనసాగేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదల జీవితాల్లో వెలుగులు నింపే సంస్థకు మద్దతు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media