మంగళగిరి సీతారామస్వామి ఆలయంలో మంత్రి నారా లోకేష్

March 25, 2026 1:46 PM

బ్రహ్మోత్సవాల సందర్భంగా పాత మంగళగిరిలోని శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి లోకేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్ తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media