పోలవరం పనులపై జలశక్తి కార్యదర్శితో మంత్రి నిమ్మల భేటీ

March 25, 2026 1:49 PM

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావుతో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన కార్యదర్శితో వివిధ అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల పునరావాస పనులను కూడా సమాంతరంగా చేపట్టామని వివరించారు. పెండింగ్ డిజైన్లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కోరారు.పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల రీయింబర్స్‌మెంట్, వరద నీటి వినియోగం, నదీ గట్టుల బలోపేతం వంటి అంశాలపై కూడా మంత్రి సూచనలు చేశారు. అలాగే పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉండగా, ఆర్‌ఆర్‌ఆర్, పీఎంకేఎస్‌వై, వరద నియంత్రణ పనులకు కేంద్రం సహకారం అందిస్తుందని జలశక్తి కార్యదర్శి హామీ ఇచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media