టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే Dhulipalla Narendra కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి Nara Lokesh హాజరయ్యారు.

గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy కూడా కుటుంబంతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి మంత్రి లోకేష్ ఆహ్వానం పలికారు.అనంతరం నూతన వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌లను ఆశీర్వదించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వివాహ వేడుకలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

