కడపలో నాటుసారా స్థావరంపై పోలీసుల దాడి బెల్లం ఊట ధ్వంసం

March 25, 2026 3:07 PM

జిల్లాలో నాటుసారా తయారీపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కొండాపురం మండలం టి.కోడూరు గ్రామ పరిధిలో నాటుసారా తయారీ స్థావరంపై దాడి నిర్వహించారు.

కడప జిల్లా ఎస్పీ Nachiket Vishwanath Shelke ఆదేశాల మేరకు తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై మంజునాథ్ ఈ దాడి చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 150 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.నాటుసారా తయారు చేస్తున్న శ్రీనాథరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media