ప్రముఖ దర్శకుడు Ram Gopal Varma తన కొత్త ప్రాజెక్ట్ ‘Syndicate’ ను ప్రకటించారు. ఈ చిత్రం మల్టీ-స్టారర్‌గా తెరకెక్కనున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని ఆర్జీవీ స్వయంగా వెల్లడిస్తూ, “Satya, Company, Sarkar సినిమాలు నా పాత గురువు Francis Ford Coppolaకు నివాళిగా ఉంటే, ‘Syndicate’ నా కొత్త గురువు Aditya Dharకు అంకితం” అని పేర్కొన్నారు.సమాచారం ప్రకారం, ఈ సినిమా గ్లోబల్ టెర్రర్ నెట్‌వర్క్స్ అయిన Al-Qaeda, ISIS వంటి అంశాలపై, అలాగే భారత రాజకీయ వ్యవస్థతో ఉన్న అనుసంధానాలను పరిశీలించే విధంగా రూపొందనుంది.ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, నిర్మాణ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.ఇటీవల ‘Konda’, ‘Dangerous’, ‘Vyuham Siddham’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈ భారీ ప్రాజెక్ట్‌తో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ఆర్జీవీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
